![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -347 లో... భవాని దగ్గరకి ముకుంద వచ్చి మనం ఏదో తప్పు చేస్తున్నట్లు ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. ఇంట్లో అందరు బ్రేక్ ఫాస్ట్ కోసం అ కృష్ణ దగ్గరకు వెళ్లారంటు భవానిని మరింత రెచ్చగొట్టేలా ముకుంద మాట్లాడుతుంది. అసలు ఈ కోర్ట్? ఈ నిజం తేలడమేంటి అత్తయ్య? నాకు మురారితో జీవితం పంచుకోవడం కావాలంతే అని భవానితో ముకుంద చెప్పుకుంటూ బాధపడుతుంది.
మరొకవైపు ఇంట్లో అందరు బ్రేక్ ఫాస్ట్ కోసం కృష్ణ దగ్గరకి వెళ్తారు. సరదాగా అందరూ నవ్వుతు ఉంటారు. అప్పుడే భవాని వస్తుంది. మీరేం చేస్తున్నారో మీకు అయిన అర్థం అవుతుందా అని భవాని కోపంగా అంటుంది. ఆనందంగా ఉండడం కూడా తప్పేనా అని రేవతి అంటుంది. ఆనందం కాదు పైసాచిక ఆనందం.. ఇంట్లో ముకుంద జీవితం ఏం అవుతుందోనని చావడానికి కూడా సిద్ధపడింది. మీరు అవేమి పట్టించుకోకుండా ఇలా నవ్వుకుంటూ ఉంటున్నారా అని భవాని అంటుంది. కృష్ణ, మురారి ఇద్దరు ఎదో చెప్పబోయే ప్రయత్నం చేస్తుంటే భవాని వినదు. నేను ఆ ఇంటికి ఏసీపీ సర్ రమ్మని చెప్పిన ఎందుకు రాలేదు. ముకుంద ఇంక బాధపడుతుందని రాలేదని కృష్ణ అనగానే.. నువ్వు అందుకు రాకుండా ఉండలేదు. ఎక్కడ నిజం బయట పడుతుందో అనే భయానికి రాలేదని భవాని అంటుంది. అ తర్వాత భవాని కోపంగా వెళ్ళిపోతుంది. భవాని వెనకాలే రేవతి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కృష్ణ వాళ్ళు సరదాగా ఉన్నది భవాని గుర్తుచేసుకొని ముకుంద బాధపడడంలో అర్థం ఉందని అనుకుంటుంది. అప్పుడే రేవతి వస్తుంది. అప్పుడే వచ్చేసావా ఇంకా కాసేపు ఉండలేకపోయావా అని భవాని అనగానే.. ఉంటే తప్పేంటంటు భవానికి రేవతి ఎదురు తిరుగుతుంది. కృష్ణనే తప్పు చేసి ఉంటే మీ కంటే ముందే వాళ్ళకి డివోర్స్ ఇప్పించేదాన్ని. మీరు కృష్ణ తప్పు చెయ్యలేదని తెలిస్తే వాళ్ళిద్దరి బంధాన్ని అంగీకారిస్తారా అని రేవతి అనగానే.. నిజం తేలాక చెప్తానని భవాని అంటుంది.
మరొకవైపు భవాని కోపంగా మాట్లాడింది అని శకుంతల బాధపడుతుంది. ఇంతవరకు ఎవరు అక్కకి ఎదరు తిరుగలేదు ఏమనుకుంటుందోనని రేవతి అనుకుంటుంది.. అప్పుడే అక్కడికి సుమలత, ప్రసాద్, కాసేపటికి నందు, గౌతమ్, మధు వచ్చి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ముకుంద వాళ్ళందరి దగ్గరికి వచ్చి.. నా గురించి మాట్లాడుకుంటున్నారా? నేను వచ్చేవరకు ఆపేసారంటూ కోపంగా వెళ్తుంటుంది. అప్పుడే దేవ్ వస్తాడు. దేవ్ రావడం చూసి ముకుంద షాక్ అవుతుంది. ఎవరు నువ్వు అంటు రేవతి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |